సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: మతం ఏదైన మానవత్వం గొప్పది.. కానీ, పాకిస్తాన్ దేశంలో సింఝోరోలో అక్కడి మతోన్మాదులు ఓ హిందూ మహిళ (40) తలను తెగనరికి, ఆమె చర్మాన్ని ఒలిచేసినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) నేడు, గురువారం స్పందించింది. మైనారిటీలకు రక్షణ కల్పించవలసిన బాధ్యతను నెరవేర్చాలని పాకిస్థాన్‌ను భారత్ కోరింది. వారికి భద్రత, రక్షణ ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరింది. పాకిస్థాన్‌ తొలి హిందూ మహిళా సెనేటర్ కృష్ణ కుమారి ఇచ్చిన ట్వీట్‌ తో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె ఇచ్చిన ట్విట్ లో.. సింఝోరో పట్టణంలో బుధవారం దాదాపు 40 సంవత్సరాల వయసుగల హిందూ మహిళ దయా భెల్ తలను తెగ నరికి, ఆమె వక్షోజాలను కోసేసి, ఆమె ముఖం, శరీర భాగాల్లోని చర్మాన్ని ఒలిచారని వెల్లడించారు. మృతురాలికి నలుగురు పిల్లలు ఉన్నారని తెలిపారు. సంఘటనా స్థలానికి తాను వెళ్ళానని, సింఝోరో, షాపుర్చకర్ పోలీసులు కూడా చేరుకున్నారని తెలిపారు.ఈ నేపథ్యంలో నేడు, గురువారం విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఎంఈఏ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి స్పందిస్తూ, ఈ సంఘటన గురించి పూర్తీ నివేదిక కొసం ఆదేశించామని, అయితే . మైనారిటీల రక్షణ పట్ల పాకిస్థాన్‌ శ్రద్ధ వహించాలని గతంలో కూడా చెప్పామన్నారు. ఇటువంటి అమానుషాలు సహించలేమని ఇదే విషయాన్ని పునరుద్ఘాటిస్తున్నానని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *