సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం బ్రాండ్ మాటల మాంత్రికుడు , అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అతడు, ఖలేజా సినిమాల తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మిస్తున్న సినిమా అనేక అవాంతరాలు దాటుకొని ఎట్టకేలకు ఈ జనవరి 9 వ తేదీన షూటింగ్ ప్రారంభించి వరుసగా 3 రోజులు కొనసాగించి, తదుపరి సంక్రాంతి పండగ అయ్యాక మళ్ళీ జనవరి 15 నుంచి మహేష్ తో రెగ్యులర్ షూటింగ్ చేస్తారని సమాచారం. కేవలం 5 నెలల లోపే షూటింగ్ పూర్తీ చెయ్యనున్నారు. ఈ సినిమా లో పూజ హెగ్డే కథానాయికగా నటిస్తుండగా, సంయుక్త మీనన్ మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. మరో బాలి వుడ్ స్టార్ హీరో మహేష్ కు తండ్రిగా కీలక పాత్రలో నటిస్తారని తెలుస్తుంది.
