సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2023 చేపట్టిన ఎన్నికల సంఘం తాజగా విడుదల చేసిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్లు తుది జాబితా లో గత ముసాయిదా జాబితాతో పోలిస్తే తుది జాబితాలో 1,30,728 మం ది ఓటర్లు పెరిగారు. పురుషుల కం టే మహిళా ఓటర్లే ఎక్కువ వచ్చారు. దీనితో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఓటర్ల సం ఖ్య 3,99,84,868కు చేరింది. గతంతో పోలిస్తే తుది జాబితాలో 1,30,728 మం ది ఓటర్లు పెరిగారు. గతేడాది నవం బరు 9న విడుదల చేసిన ముసాయిదా జాబితాలో 3,98,54,093 మంది ఓటర్లు ఉండగా.. ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టిన తర్వాత ఎన్నికల సంఘం కొత్తగా 5,97,701 మంది ఓటర్లను జాబితాలో చేర్చింది. 4,66,973 మందిని తొలగించింది. ఈ వివరాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్‌కుమార్ మీనా ప్రకటించారు. రాష్ట్రంలో అతి తక్కువ ఓటర్లున్న జాబితాలో మొదటి మూడు స్థానాల్లో కృష్ణా జిల్లా పెడన, పశ్చి మగోదావరి జిల్లా లోని నరసాపురం, ఆచంట ఉన్నాయి. వీటికి లక్ష కు దగ్గరగా ఓట్లు ఉండగా ఇక పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం మీద 14,43,344 మంది ఓట్లర్లు నమోదు అయ్యారు. భీమిలి నియోజకవర్గం లో అంతకంటే ఎక్కువగా 3,28,899 మంది ఉన్నారు..
