సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: వేలాది తరాలుగా వర్ధిల్లుతున్న హిందుమత విశ్వాసాలు వాటి గొప్పతనం భావి తరాలకు ప్రచారం, స్ఫూర్తి నింపడంలో భాగంగా 220 మంది భక్తులు పాలకొల్లు నుండి నడక మార్గమున 23 కిలోమీటర్లు నడచి భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. వారందరిని అభినందిస్తూ వారికీ మర్యాద పూర్వకంగా శ్రీ అమ్మవారి దర్శనం చేయించి ప్రసాదాలు అందజేశారు. ఆలయ ప్రధాన ఆర్చుకులు వీరందరికి పూజలు నిర్వించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మానేపల్లి నాగేశ్వరరావు ధర్మకర్త రామాయణం సత్యనారాయణ, ఆలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి యర్రంశెట్టి భద్రాజీ పాల్గొన్నారు
