సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్దానములో గత 40 రోజులకు భక్తులు సమర్పించిన కానుకల ఆదాయం లెక్కించగా నగదు రూపంలోరూ. 26,17,690-00 రూపాయల ఆదాయం సమకూరగా కానుకలు రూపంలో బంగారం: 028 గ్రాములు,500 మిల్లిలు మరియు కొద్దిగా విదేశీ కరన్సీ నోటులు వచ్చినవి. ఈ హుండీల లెక్కింపు కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ మానేపల్లి నాగేశ్వరరావు(నాగన్న బాబు)మరియు ధర్మ కర్తలు: ముత్యాల వెంకట రామారావు, చెల్లంకి నాగ శేషగిరి(గిరి), మావూరి సుందరరావు, రామాయణం సత్యనారాయణ, గోపిశెట్టి విజయలక్ష్మి, కోయ వెంకటలక్ష్మీ, నీలాపు విజయ నాగలక్ష్మి, ఎక్స్ అఫీషియో మెంబర్, బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ, ఆలయ సహాయ కమిషనర్,ఈఓ యర్రంశెట్టి భద్రాజి మరియు ఈవో తోట శ్రీనివాసరావు, పంచారామ సోమేశ్వర గుడి ఈఓ అరుణకుమార్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు..
