సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్లో గత స్థానిక ఎన్నికల ముందు విజయనగరం జిల్లాలో పురాతన శ్రీ రాములవారి విగ్రహంకు కొందరు అజ్ఞానులు,అరాచక శక్తులు తీవ్ర అపచారము చేసిన నేపథ్యంలో..వెంటనే జగన్ సర్కార్ ఇచ్చిన హామీమేరకు, నేడు, బుధవారం పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం నీలాచలం బోడికొండపై రూ.3కోట్ల వ్యయంతో నిర్మించనున్న శ్రీ కోదండ రామాలయ పునఃనిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణితోపాటు జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, దేవస్థాన అధికారులు హాజరయ్యారు. శంకుస్థాపన అనంతరం వించ్ మోటారు సహకారంతో ట్రాక్ మీదుగా శిలా ఖండాలను ఒక్కొక్కటిగా కొండపైకి చేరవేసి ఆలయాన్ని నిర్మించడానికి ఏర్పాట్లు చేశారు. మండపంతోపాటు ధ్వజస్తంభం, ఆలయ ప్రాకారం, వంటశాలను నిర్మించనున్నారు.ఆలయ ధర్మకర్తగా శంకుస్తాపన కార్యక్రమానికి వచ్చిన మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ సీనియర్ నేత, విజయనగర ప్రభువుల వారసుడు అశోక్ గజపతి రాజు ఎవరు ఊహించని విధంగా ఒక్కసారిగా ఆగ్రహోత్రుడు అయ్యారు. ధ్వంసం చేసిన ఆలయాన్ని ప్రభుత్వం నిర్మించడమేమిటి? అని,మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేరున ఉన్న శిలాఫలకాన్ని తొలగించాలని అశోక్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసారు.ఆ క్రమంలోనే శంకుస్థాపం బోర్డును సైతం అశోక్‌గజపతిరాజు పీకిపారేశారు. మరల అధికారులు ఆయనను శాంతింప చేసారు. ఈ ఘటనపై, మంత్రి వెల్లంపల్లి
