సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: మరో 2 రోజులలో సంక్రాంతి పండుగ ప్రారంభమౌతుంది. ఈ నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందాలు, జూదాలను కట్టడి చెయ్యడానికి, జిల్లా కలెక్టర్ ప్రశాంతి, జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ ఆదేశాలమేరకు పోలీసులు , రెవెన్యూ అధికారులు ఈ సారి కోడిపందాల పోటీలు నిర్వహించిన వారితో పాటు ఆ స్థలాలు అద్దెకు ఇచ్చిన వారిపై కూడా కేసులు పెడతామని హెచ్చరించారు. అంతేకాదు ప్రజలలో చైతన్యం తేవాలని, స్వచ్చంద సంస్థల సహకారంతో గ్రామా గ్రామాన సదస్సులు నిర్వహించి జూదాలతో జీవితాలను నాశనం చేసుకోవద్దని సాంప్రదాయ పద్దతిలో పండుగలు చేసుకోవాలని హితవు చెపుతున్నారు. పాలకోడేరు, కొడవల్లి తదితర చోట్ల ఆటోలలో కూడా ప్రచారం చేస్తున్నారు, తాజాగా ఆకివీడులో మహిళలతో కలసి పోలీసులు పట్టణ వీధుల గుండా పందాలకు దూరంగా ఉండమని భారీ చైతన్య ర్యాలీ నిర్వహించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *