సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మెగాస్టార్ చిరంజీవి , మాస్ మహారాజా రవితేజ మల్టీస్టార్ సినిమా ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి స్పెషల్‌ గా ప్రపంచవ్యాప్తంగా నేడు శుక్రవారం (జనవరి 13) భారీ స్థాయిలో విడుదలైంది. బాబీ కొల్లి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటించగా.. మాస్ మహారాజా రవితేజ ఓ కీలక పాత్రలో నటించారు. ప్రకాశ్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, బాబీ సింహా వంటి భారీ తారాగాణం ఈ చిత్రంలో నటించారు. ఇప్పటికే ఈ సినిమాకు అన్ని చోట్ల ప్రీమియర్స్, బెనిఫిట్ షోలు పడ్డాయి. ఏపీలో ప్రభుత్వం అదనపు ఆటలకు టికెట్ ఫై 25 రూపాయలు రేటు పెంచుకోవడానికి కూడా అనుమతి ఇవ్వడంతో చాల చోట్ల కూడా అర్థరాత్రి నుంచే సందడి మొదలయింది. . భీమవరంలో దాదాపు 11 థియేటర్స్ లో ..? తెల్లవారు జామునుండే ప్రీమియర్ షోలు వేశారు. ఇక సినిమా కు మంచి మాస్ టాక్ వినపడుతుంది. మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సినిమా తీశారు కాబ్బటి సంక్రాంతి సినిమాగా వీర సింహారెడ్డి కి మంచి పోటీ ఇస్తుంది. ఫస్ట్ హాఫ్ సినిమా లో బాస్ ఎంట్రీ సీన్, వింటేజ్ కామెడీ, సాంగ్స్‌లో డ్యాన్స్ స్టెప్స్.. మొత్తంగా ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్. విశ్రాంతి వరకు మొత్తం చిరంజీవి నడిపిస్తే సెంకండ్ ఆఫ్ లో రవితేజ తోడవుతాడు. మెగాస్టార్ కామిడి చింపేసాడు .. అయితే పూనకాలు లోడింగ్ థియేటర్స్ లో అంతగా లేదు అని టాక్. .. రవితేజ అద్భుతమైన నటన ప్లస్ పాయింట్.. అయితే . దేవిశ్రీ సంగీతం సో సో అంటున్నారు. వినోదానికి డోకా లేదని టాక్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *