సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గునుపూడి భీమవరం నందు వేంచేసి యున్న పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వారి దేవస్థానం నందు నేడు, శనివారం సంక్రాంత్రి శోభను ప్రతిబింబించేలా శ్రీ సోమేశ్వర స్వామి స్వయం భూ లింగాన్ని అలంకరించడం జరిగింది. చెరకు గడలు, వివిధ రకాల పుష్పాలతో అలంకరణ చేసారు. ధనుర్మాసోత్వముల సందర్భముగా దేవాలయంలో శ్రీ జనార్ధస్వామి ఉపాలయం నందు గల శ్రీకృష్ణునకు భోగి పళ్ళ కార్యక్రమం నిర్వహించగా ఆలయ ధర్మకర్తల మండలి అథ్యక్షులు శ్రీమతి కోడే విజయ లక్ష్మి పాల్గొనడం జరిగిందని ఆలయ ఇఓ ఎం అరుణ్ కుమార్ తెలిపారు.
