సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా లో సంక్రాంతి కోడిపందాలు జోరు నేడు, ఆదివారం మరింత పెద్ద స్థాయిలో జరగడానికి నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేసారు.ఉదయం 9 గంటల నుండే ప్రారంభమయ్యే ఈ పందాలు రాత్రి ఫ్లడ్ లైట్స్ వెలుగులతో కూడా కొనసాగుతాయి. కరోనా తరువాత గతంలో ఎన్నడూ లేని స్థాయిలో భీమవరం పరిసర ( ఉండి , పాలకొల్లు పరిధి వరకు ) తగ్గేదేలే అన్న స్థాయిలో హోరాహోరీగా భారీ స్థాయిలో పందాలు జూదాలు జరిగాయి. ఆఖరికి భీమవరం పట్టణంలో కూడా కోడిపందాలు ఓ స్థాయిలో జరిగాయి. ఇక్కడ పోలీసులు, అధికారులు అసమర్ధత అనే కన్నా, ఎక్కడైన రాజకీయం కానీ సంక్రాంతి పండుగ కోడిపందాలు, జూదాలు , సరదాలు వద్ద మాత్రం అన్ని రాజకీయ పార్టీలు లోపాయికారంగా సహకరించుకొనే సంప్రదాయం ఈ ఏడాది కూడా పాటించారు. భీమవరం పరిసర ప్రాంతాలలోని వెంప, పెన్నాడ ,కొణితివాద ,డేగాపురం, కాళ్ల మండలం సీసలి, ఆకివీడు మండలం దుంపగడపలో తిరునాళ్లను తలపించే భారీ బరులును సంక్రాంతి సంబరాలకు వచ్చే అతిధులకు అన్ని బిర్యానీ రుచులతో , తినుబండారాలు ,అన్ని ఆతిద్యలతో ఏర్పాట్లు చేసారు. దూరప్రాంతాల నుండి వచ్చే అతిధులు ఈ ప్రాంత సంక్రాంతి వైభవాన్ని తనివితీరా ఆస్వాదించడానికి ఎన్నో వినోదాలు, సాంసృతిక కార్యక్రమాలు, కబాడీ పోటీలు కూడా భారీ స్థాయిలో ఏర్పా టు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *