సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రేపు , మంగళవారం భీమవరం ఆనంద హాలులో ప్రారంభమౌతున్న బీజేపీ పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశాలు నేపథ్యంలో భీమవరంలోని అన్ని ప్రధాన సెంటర్స్ బీజేపీ జెండాలు, నేతల స్వాగత ద్వారాలతో కాషాయమయం అయ్యింది. 5గురు కేంద్ర మంత్రులు వస్తారని భావిస్తున్నారు. దీనిపై నేడు, మంగళవారం రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి బిట్రా శివన్నారాయణ, బిజెపి రాష్ట్ర నేతలు పాకాసత్యనారాయణ, భూపతిరాజు శ్రీనివాస వర్మ, కాయిత సురేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి పేరిచర్ల వెంకట శ్రీనివాస్ రాజు (సుభాష్) మీడియా సమావేశం లో మాట్లాడుతూ.. భీమవరంలో మూడు పర్యాయాలు జరిగాయని, 4వ సారి జరుగుతున్నాయని అన్నారు. బిజెపికి పశ్చిమ గోదావరి జిల్లాతో, భీమవరం కేంద్రంగా ఎంతో అనుబంధం ఉందని, ప్రాంతీయ పార్టీలు బీజేపీ పై విషప్రచారం చేస్తున్నాయని, ఇకపై బీజేపీ నేతలు గ్రామా గ్రామానికి వెళ్లి ప్రజలలో ప్రధాని మోడీ ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తామన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో భీమవరం, నరసాపురం, తాడేపల్లి గూడెంలలో బీజేపీ ప్రతిష్టాకరంగా పోటీ ఇస్తుందని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ప్రత్యేక పెట్టిందని, కీలక పాత్ర పోషించనున్నామని తెలిపారు. గతంలో నర్సాపురం పార్లమెంట్ ను 2 సారులు బీజేపీ కైవసం చేసుకొందని, ఇకపై ఎప్పుడు ఈ లోక్ సభ సీటు లో బీజేపీ మాత్రమే గెలిచేలా ప్రజల మద్దతు పొందుతామన్నారు. భీమవరంలో జరిగే రాష్ట్రకార్యవర్గ సమావేశాల్లో బిజెపి కీలక పాత్ర పోషిస్తోందని, ఈ రాష్ట్రంలో గతంలో 18 శాతం ఓటింగ్ సాధించిన పార్టీ బిజెపి అని, రాష్ట్ర రాజకీయాల్లో కీలక సమయం ఇదేనని అన్నరు. టీడీపీ, వైసిపి లతో పొత్తు ను కొట్టి పారేసారు. కుటుంబరాజకీయ పార్టీలకు బీజేపీ దూరం అన్నారు.
