సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నందు పవిత్ర పంచారామ క్షేత్రం లో వేంచేసి యున్న శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవములు(మహా శివరాత్రి మహోత్సవములు) సందర్భముగా ఈ రోజు, సోమవారం పందిరిరాట కార్యక్రమం నిర్వహించి, వేడుకలకు ఏర్పాట్లను ప్రారంభించారు. స్వామివారి దయతో అంగరంగ వైభవంగా మహాశివరాత్రి వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం నందు ధర్మకర్తల మండలి అధ్యక్షలు శ్రీమతి కోడే విజయలక్ష్మి, మరియు ధర్మకర్తలు మరియు గునుపూడి వాసులు పాల్గొనగా, దేవాలయం కార్యనిర్వహణాధికారి , ఎం అరుణ్ కుమార్ , దేవాలయ సిబ్బంది ఏర్పాట్ల ను పర్యవేక్షించారు.
