సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి , రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర కు సిద్దమౌతున్న నారా లోకేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా భీమవరం తెలుగుదేశం పార్టీ నేతలు ఆధ్వర్యంలో పంచారామ క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేయించారు. లోకేష్ కు పార్టీ కి మంచి జరగాలని ఆయన 4000 కిమీ పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి మెంటే పార్ధసారధి నేతృత్వం వహించగా .. ఈ సందర్భముగా కోళ్ళ నాగేశ్వర్ రావు సౌజన్యంతో భక్తులకు ప్రసాద వితరణ చేసారు. ఈ కార్యక్రమంలో గంటా త్రిమూర్తులు మామిడి శెట్టి ప్రసాద్ రేపు వెంకన్న,మాజీ కౌన్సిలర్ సతీష్ , ముద్దుల రాము, కనకదుర్గ హసీనా బేగం పామర్తి వెంకటరామయ్య రామకృష్ణ చౌదరి కబుజ హరిబాబు బొక్క శ్రీను పురోహితులు సంతోష్ శ్రీధర్ ఐజాక్ కొండ్రు శీను నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
