సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పై టీడీపీ, ఆ పార్టీ బాకా మీడియా కలసి అడ్డగోలు విమర్శలు చేస్తున్నాయని వైసిపి అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. నేడు, బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ,.. నిజానికి చంద్రబాబు తన ఊహాల్లో మాత్రమే ఏపీని అభివృద్ధి చేశారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ప్రజాభిమానాన్ని ఓర్వలేకపోతున్నారని, చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో ఎన్ని వాగ్దానాలు నెరవేర్చారో చెప్పగలరా? మరోసారి అధికారంలోకి వస్తే పేదల గృహాల ఫై వారికే ఎన్నివేల రూపాయల బకాయిలు ఉన్నపటికీ వారికే పూర్తీ హక్కును కల్పిస్తూ జగన్ ప్రభుత్వం చేస్తున్న స్వల్ప డబ్బుతో ( 5వేలు నుండి 30 వేలు చెల్లించి) ఒకేసారి సెటిల్మెంట్ ను విమర్శిస్తున్న చంద్రబాబు గతంలో రైతులకు 70 వేల రుణ మాఫి ఎందుకు చెయ్యలేదని, మరోసారి అధికారంలోకి వస్తే పేదలకు డబ్బులు తిరిగి ఇస్తాడట? ఎవరు నమ్మాలి! అసలు అధికారంలోకి ప్రజలు రానిస్తారా ? లోకేష్ తన తల్లిని వైసిపి వాళ్ళు అవమానించామని ఇవ్వాళ కూడా ఎదో తెలుస్తామంటున్నాడు.. ఆడువారిని అవమానించే కుసంస్కారం మీ నాన్నదే.. అసలు వైసిపి నేత ఎవరు మీ అమ్మను అవమానించి మాట్లాడారో? వారి పేరు చేప్పు ? అని సవాల్ చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *