సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో గునుపూడి లోని పవిత్ర పంచారామ క్షేత్రం లో వేంచేసి యున్న శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నకు నేడు, శుక్రవారం ఉదయం సినినటీ అమని విచ్చేయగా స్వామివారికి ప్రత్యేక పూజలు అనంతరం ఆలయం అర్చకులు ఆశీర్వదించినారు. అనంతరం ఆలయం ధర్మకర్తల మండలి ఛైర్మన్, కోడే విజయలక్ష్మి, ఆలయ కార్యనిర్వహణాదికారి, ఎం అరుణ్ కుమార్ ఆమెకు శ్రీ స్వామివారి జ్ఞాపిక ను అందజేశారు. ఈ కార్యక్రమం నందు ఆలయ ధర్మకర్తలు చెల్లబోయిన సూర్యప్రకాశరావు, లక్కు త్రిమూర్తులు, నల్లం రఘుబాబు, తాణాల రామకృష్ణ పాల్గొయున్నారు.
