సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్:కుప్పంలో గుండెపోటుతో కుప్పకూలి గత అర్ధరాత్రి నుండి బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న సినీ నటుడు నందమూరి తారకరత్న హెల్త్ బులిటెన్‌ను తాజాగా నేటి శనివారం సాయంత్రం విడుదల చేశారు. తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు హెల్త్ బులిటెన్‌లో వైద్యులు వెల్లడించారు. కార్డియాలజిస్ట్‌లు, ఇంటెన్సివిస్ట్‌లతో సహా మల్టీ- డిసిప్లినరీ క్లినికల్ టీమ్ తారకరత్న ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ తర్వాత కార్డియోజెనిక్ షాక్ కారణంగా ఆయన పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందని వైద్యులు హెల్త్ బులిటెన్‌లో తెలిపారు. ఎక్మో వైద్య విధానం ద్వారా తారకరత్నకు కృతిమంగా శ్వాసనందిస్తున్నట్లు తెలిసింది. గుండె దాదాపుగా పనిచేయని కారణంగా బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా రక్తాన్ని పంపింగ్ చేసేందుకు వైద్యులు ప్రయత్నం చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ హాస్పిటల్‌లో ఉండి కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, . జూ. ఎన్టీఆర్ తో సహా ఆయన కుటుంబసభ్యులు అందరు నేటి రాత్రి కి హాస్పిటల్‌కు చేరుకొంటారని భావిస్తున్నారు. నిన్నటి లోకేష్ పాదయాత్ర ప్రారంభం వరకు ఉత్సహంగా పాల్గొన్న తారక రత్న పరిస్థితి ఫై నందమూరి కుటుంబంలో, టీడీపీ శ్రేణులలో తీవ్ర ఆందోళన నెలకొంది.
