సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణలోకరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తితో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నేడు, గురువారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు గానీ ఇతర పండుగలకు జనం గుంపులు గుంపులుగా ఉండకుండా రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణలో కోవిడ్ , ఓమిక్రాన్‌పై హైకోర్టు తాజగా విచారణ చేపట్టింది.ఈ సందర్భంగా మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాల మాదిరే ఆంక్షలు విధించాలని ఆదేశించింది. ఎయిర్ పోర్ట్ లో ఉన్న విధంగానే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే జనాలకు తగిన పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేయమని ఆదేశించింది. ఒక్కరోజులో తెలంగాణాలో రాష్ట్రంలో మరో 14 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ వేరియంట్ బాధితుల సంఖ్య 38కి చేరింది. మొత్తం 38 కేసుల్లో 31 మంది నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. ఆరుగురు రిస్క్ దేశాల నుంచి రాగా.. తొలిసారిగా ఒక రికి తెలంగాణలో ఒమిక్రాన్ సోకింది
