సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లి గూడెంలో ప్రతిష్టాకరమైన ‘నిట్’ జాతీయ విద్య సంస్థలో లో నేడు, గురువారం, కొత్తగా ఆంధ్రప్రదేశ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పండిట్ మదన్ మోహన్ మాళవీయ అకడ మిక్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. బీజేపీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, ఆర్‌ఎస్‌ఎస్ జాతీయ కార్యవర్గ సభ్యుడు రామ్ మాధవ్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. ఇక్కడి ప్రాంత విద్యార్థులకు కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటయిన నిట్ అదనపు ఆధునిక విద్య వసతులు , విద్య స్థాయి ప్రమాణాలు బాగా పెరుగుతున్నాయని, ఇక్కడి విద్యార్థులకు జాతీయ స్థాయిలో ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించడం సులభతరమైందని , జాతీయ విద్యా విధానం శ్రేయస్సు కరమైనదని అన్నారు. నిట్ డైరెక్టర్ డాక్టర్ సూర్యప్రకాశ్‌రావు కూడా మాట్లాడారు.
