సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బుధవారం ఉదయం 11 గంటలకు 2023-24 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటుకు సమర్పించారు. ఈ బడ్జెట్‌లో అనుసంధానంగా ప్రెవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో గత ఏడాది కన్నా సుమారు 4 రేట్ల వరకు భారీ కేటాయింపులతో ఈ రైల్వే బడ్జెట్ ఉంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం 2014లో అధికారం చేపట్టడానికి ముందు యూపీఏ ప్రభుత్వం చేసిన ఖర్చు కన్నా తొమ్మిది రెట్లు ఎక్కువ వ్యయం చేయబోతున్నట్లు నిర్మల తెలిపారు.పార్లమెంటులో నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రసంగం చేస్తూ, 2013-14 బడ్జెట్‌లో రైల్వేలకు రూ.2.4 లక్షల కోట్లు 2023-24 బడ్జెట్లో కేటాయించినట్లు తెలిపారు. రైల్వేల అభివృద్ధికి దోహదపడే మరొక పథకాన్ని కూడా ఆమె ప్రకటించారు. 100 క్రిటికల్ ట్రాన్స్‌పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు, వీటి కోసం రూ.75,000 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. నౌకాశ్రయాలు, బొగ్గు క్షేత్రాలు, ఎరువుల కంపెనీలు, ఆహార ధాన్యాల గోదాములు వంటివాటిని అనుసంధానం చేస్తూ ఈ ప్రాజెక్టులను నిర్మిస్తారు. రూ.15,000 కోట్ల పెట్టుబడులను సేకరించేందుకు ప్రైవేట్ రంగం సహకారం కూడా తీసుకుంటారు.తెలుగు రాష్ట్రాలకు చేసిన కేటాయింపుల పూర్తీ సమాచారం ఇంకా అందవలసి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *