సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్తో 2023-24 దేశీయ ఈక్విటీ మార్కెట్లలో భారీ జోష్ నింపింది. వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి 5 లక్షల నుండి 7 లక్షలకు పెంపుతోపాటు ఎలాంటి ప్రతికూల ప్రకటనలు లేకపోవడంతో సూచీలు రాకెట్లలా దూసుకెళ్తున్నాయి. ట్యాక్స్ స్లాబుల సవరణ సానుకూలమైందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. నేటి బుధవారం మధ్యాహ్నం 1 గంట సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1200 పాయింట్లకుపైగా లేదా 2 శాతం మేర వృద్ధి చెంది 60,750 పాయింట్ల ఎగువన ట్రేడ్ అవుతోంది. మరో సూచీ ఎన్ఎస్‌ఈ నిఫ్టీ ఏకంగా 300 పాయింట్లు లేదా 1.70 శాతం ఎగబాకి 17,965 పాయింట్ల ఎగువన ట్రేడ్ అవుతోంది. ఎల్‌& టీ, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, ఎన్‌బీసీసీ, గెయిల్, ఎస్‌బీఐఎన్, పీఎఫ్‌సీ, పవర్‌గ్రిడ్, ఎన్ఎల్‌సీఐఇండియా, నేషనల్ అల్యూమినియం వంటి షేర్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *