సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సుమారు 3 ఏళ్లుగా సుదీర్ఘ కాలం షూటింగ్ జరుపుకున్న సినిమా.. ఆచార్య ఇక పక్కాగా.. ఫిబ్రవరి 4న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్ లో కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ మూవీ ‘ఆచార్య’. సినిమాకి సంబంధించి ఇంతవరకూ రెండు టీజర్స్, రెండు పాటలు విడుదలవగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం చరణ్ ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ ప్రమోషన్స్ లో ఫుల్ బిగా ఉన్నాడు. ఈ సినిమా విడుదలయ్యాకా.. అంటే జనవరి సెకండ్ వీక్ నుంచి ‘ఆచార్య’ ప్రమోషన్స్ ను ఓ రేంజ్ లో చేయబోతున్నారని టాక్. అందులో భాగంగా అభిమానులకు ‘ఆచార్య’ నుంచి అదిరిపోయే అప్డేట్ ను ఇవ్వబోతున్నారట. ‘ఆచార్య’ సినిమాలో చిరు, చెర్రీ నటించిన కాంబో సన్నివేశాల నుంచి టీజర్‌ను కట్ చేయబోతున్నారట. ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్ అంటున్నారు. జనవరి నెలాఖరుకు ప్రీరిలీజ్ ఈవెంట్ జరిపి.. ఆ వేదికపైనే ట్రైలర్ ను కూడా విడుదల చేయబోతున్నట్టు టాక్.. . కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే కథానాయికలు గా నటిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
