సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం బీష్మ ఏకాదశి పర్వదినం సందర్భముగా భీమవరం పట్టణంలో అన్ని ప్రముఖ దేవాలయాలు భక్తులతో కళకళ లడాయి. ఇక భీమవరం నుండి అంతర్వేది కి నిన్న, నేడు వివిధ వాహనాలులో మరియు ప్రత్యేక ఆర్టీసీ బస్సులలో, భక్తులు వేలాదిగా తరలివెళ్లారు. గోదావరి, సాగర సంగమ కెరటాల వేద హోరులో అంతర్వేదిలోని పవిత్ర పుణ్య ధామం దేదీప్య మానంగా ప్రకాశించింది. నేడు, బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుండి శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి దివ్య ఉత్సవమూర్తులను రథం పై కొలువుదీర్చి భక్తజనసంద్రంలో వైభవం గా ఊరేగించారు.. నమో నారసింహా అంటూ భక్తజన నామజపంతో జయజయ ద్వానాలు చేసారు. గత మంగళవారం అర్ధరాత్రి నుండి నేటి బుధవారం తెల్లవారు జామువరకు శ్రీదేవి, భూదేవితో నారసింహస్వామివారికి కల్యాణ మహోత్సవం వేలాది భక్తుల సమక్షంలో ఆద్యంతం వైభవం గా సాగింది.
