సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ స్థానిక క్యాంపు కార్యాలయంలో రెండవ పట్టణ సీఐ కృష్ణకుమార్, ఎస్సై అప్పారావులతో ట్రాఫిక్ సమస్యపై సమీక్ష జరిపారు. భీమవరం రెండో పట్నంలో జేపీ రోడ్డు, ఉండి రోడ్డులు రద్దీగా ఉంటున్నాయని , గోదావరి జిల్లాలలో ప్రఖ్యాత ఆసుపత్రులు ఇక్కడ ఉండటం , ప్రముఖ విద్యాలయాలు ఉండటం తో ఎంతో దూరప్రాంతాల నుండి వచ్చే వారితో ఉదయం, సాయంత్రం బస్సులు, వాహనాల రద్దీగా ఉంటుందని ఎక్కడ ట్రాఫిక్ సమస్య లేకుండా చూసుకోవాలని , ఒకేసారి బస్సులు వదలకుండా ప్రెవేటు విద్యాలయాలను ఆదేశించాలని, ఇక అంబెడ్కర్ సెంటర్ నుండి తాడేపల్లిగూడెం రోడ్లో నిర్మించిన భారీ అండర్ టన్నెల్ వల్ల చాలావరకు ట్రాఫిక్ సమస్య పరిష్కారం అయిందని తెలిపారు. అయితే భీమవరం జిల్లా కేంద్ర కావడంతో జిల్లా నలుమూలల నుండి వివిధ పనుల నిమిత్తం ప్రజలు, రోజువారి వ్యాపారస్తులు పెద్ద ఎత్తున భీమవరం వస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా, స్థానిక వ్యాపారస్తులకు ఇబ్బందులు లేకుండా ప్రణాళిక బద్ధంగా ట్రాఫిక్ పోలీసులను ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
