సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి వార్షిక మహోత్సవాలలో భాగంగా నేడు, శుక్రవారం ఫిబ్రవరి 3వ తేదీ న శ్రీ అమ్మవారు శ్రీ ధాన్యలక్ష్మి దేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. శ్రీ అమ్మవారి అలంకారం ను స్థానిక భక్తులు యు. ద్యుశ్యంత్ కుమార్ శ్రీమతి అరుణ దంపతులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు, ఈ రోజు శుక్రవారం కూడా కావడంతో ఉదయం నుండి మరింత విశేషంగా భక్తులు శ్రీ అమ్మవారిని దర్శించుకోనట్లు దేవాలయ సహాయ కమిషనర్ వై భద్రజీ తెలిపారు. నేటి రాత్రి 8 గంటల నుండి శ్రీ స్వాతి సినీ మ్యూజికల్ ఆర్కెస్ట్రా ఆహుతులను విశేషంగా అలరించనుంది.
