సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం లో ప్రతిష్టాకర కళాశాల DNR లో చదివే విద్యార్దులు ఆంధ్రా బాక్సింగ్ అసోసియేషన్, విశాఖపట్నం వారు నిర్వహించిన సి.యమ్. స్టేట్ బాక్సింగ్ ఛాంఫియన్ షిప్ లో పశ్చిమ గోదావరి జిల్లా తరుపున పాల్గొని అనేక బహుమతులు కైవసం చేసుకున్నారని కళాశాల అధ్యక్ష కార్యదర్శులు గోకరాజు వెంకట నరసింహరాజు మరియు గాదిరాజు సత్యనారాయణరాజు(బాబు) అన్నారు. క్రీడల వల్ల వ్యక్తిత్వ వికాశం, నాయకత్వ లక్షణాలు, గెలుపు ఓటమి లను సమానంగా పరిగణించడం, మానసిక వత్తిడి పై గెలపు అనేవి క్రీడాకారులకు వెన్నతో పెట్టిన విద్యగా ఉంటుందని అన్నారు. క్రీడల అభివృద్ధి నిమిత్తమై కళాశాలలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎ.కె.యస్.చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ నెల 19 నుండి 21 వ తేదీవరకూ నిర్వహించిన స్టేట్ బాక్సింగ్ ఛాఫియన్ షిప్ పోటీలలో పశ్చిమ గోదావరి జిల్లా తరుపున తమ కళాశాల ద్వితీయ సంవత్సరం విద్యార్దులు పి.కిషోర్ కుమార్, 51-54 కేజీల విభాగంలో బ్రాంజ్ మెడల్, పి.సత్య స్వరూప్ 71-75 కేజీల విభాగంలో బ్రాంజ్ మెడల్, ఎ.సాయి కృష్ణ 91 కేజీల విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించడం గర్వించదగ్గ విషయం అని అన్నారు. కళాశాల అధ్యాపక సిబ్బంది, బాక్సింగ్ కోచ్ డా.మధుకుమార్ పతాకాలు సాదించిన విద్యార్దులను అభినందించారు.
