సిగ్మాతెలుగు డాట్ ఇన్:
ముఖ్యమంత్రి వైఎస్ జగన్`కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. నేటి శుక్రవారం ఉదయం 9.10 గంటల నుంచి 9.40 గంటల వరకు ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి అంజలి ఘటించి ప్రత్యేక ప్రార్థనలలోపాల్గొన్నారు. కడప జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సీఎం వైఎస్ జగన్ నేటి
మధ్యాహ్నం ఆదిత్య బిర్లా ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తారు.
