సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఢిల్లీలోని ఆంధ్ర భవన్ లో నిన్న బుధవారం , నేడు, గురువారం వరకు జరిగిన జాతీయ స్థాయి బీసీ సంఘాల సంక్షేమ సంఘం జాతీయ అడ్జ్యాక్షుడు, వైసిపి రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో జరిగిన కీలక సమావేశాలలో కేంద్ర మంత్రి రామ్ దాస్ అతుల్వాలే తో, తెలంగాణ BRSనుండి సీనియర్ రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు పాటు అన్ని పార్టీల నుండి పలువురు జాతీయ నేతలు రౌండ్ టేబుల్ సమావేశంలో దేశంలో బీసీ ల భవితవ్యం గురించి వారికీ కేంద్ర ప్రభుత్వం నుండి కావలసిన భరోసా గురించి చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని ఆ సమావేశంలో పాల్గొన్న జాతీయ బిసి సంక్షేమ సంఘం, పశ్చిమ గోదావరి జిల్లా అద్జ్యక్షుడు కోడె యుగంధర్ ఢిల్లీ నుండి సిగ్మా న్యూస్ కు తెలిపారు. దేశ జనాభాలో అత్యధికంగా ఉన్న బిసి లకు తగిన న్నాయం జరగటంలేదని దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ పరముగా అన్ని కీలక పదవులు,లో 50 శాతం రిజర్వేషన్ ప్రకటించాలని ఎన్నికలలో కూడా ఎస్సీ, ఎస్టీ తరహాలోనే బీసీల అభ్యర్థులకు కు ప్రత్యేక రిజెర్వేషన్ సీట్లు కేటాయించే చట్టం తేవాలని చేసిన విజ్ఞప్తులను కేంద్ర మంత్రి రాందాస్ ప్రధాని మోడీ దృష్టికి తీసుకొనివెళతానని హామీ ఇచ్చినట్లు , బీసీల సంక్షేమము కు బడ్జెట్ లో 2 లక్షల కోట్ల నిధులు కేటాయించి దానిని సక్రమం గా వినియోగించేలా కేంద్రాన్ని కోరినట్లు ఆయన తెలిపారు.
