సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి నందు పంచారామ క్షేత్రాలలో ఒకటైన శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి మరియు భీమవరం పేరు పెట్టడానికి కారణమైన 11 శతాబ్ది కి చెందిన శ్రీ భీమేశ్వర స్వామి వార్ల దేవస్థానముల యందు ఈ నెల 16వ తేదీ నుండి 20వ తేదీవరకు జరగబోవు శివరాత్రి మహోత్సవముల జరగనున్నాయి. సందర్భముగా తెలుగు రాష్ట్రాల నుండి వేలాదిగా తరలివచ్చే భక్తులకు వేగంగా దర్శన ఏర్పాట్లు మరియు ఏ నెల 18వ తేదీ మహాశివరాత్రి కి పంచారామ క్షేత్రాలు దర్శించే భక్తుల వాహనాలు, ఆర్టీసీ, ప్రవేటు బస్సులు పార్కింగ్ విషయమై, 19వ తేదీన రధోత్సవం, 20న తెపోత్సవం కు చెయ్యవలసిన భద్రతా ఏర్పాట్లు ఫై నేడు, మంగళవారం రెవెన్యూ డివిజినల్ అధికారి, భీమవరం లో సంబంధిత శాఖల అధికారులతో ఆయా దేవాలయల కార్యనిర్వాహణాధికారులతో సమీక్షా సమావేశము నిర్వహించి సమన్వయంతో ముందుకు వెళ్లాలని ప్రణాళిక రచన చేసారు. .
