సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పూళ్ల రహదారిపై నేడు, శనివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం లో ఇద్దరు మృతి చెందారు. భీమడోలు మండలం పూళ్ల జాతీయ రహదారిపై వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీకొట్టడంతో సంఘటనా స్థలంలోనే బైక్ ఫై ఉన్న ఇద్దరు వ్యక్తులు రోడ్డు ఫై దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ ఆందోళనకు గురియై డ్రైవింగ్ పట్టుతప్పడంతో మోటార్ సైకిల్ ఫై ఉన్న బాధితులతోపాటు రోడ్డు పక్కన నిలబడిన వారిపై ఆర్టీసీ బస్సు దూసుకొని వెళ్లడంతో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడటం జరిగిందని ప్రాధమిక సమాచారం.. పూర్తీ వివరాలు తెలియవలసి ఉంది
