సిగ్మాతెలుగు,డాట్ ఇన్, న్యూస్: భీమవరం లో నేడు, శనివారం క్రిస్మస్ పర్వదినం సందర్భముగా గతవారం రోజుల ముందునుండి నుండి అన్ని చర్చిలలను మిరుమిట్లు గొలిపే లైటింగ్ , ఇతరుల సెట్టింగులతో అలంకరించి గత సాయంత్రం నుండి నేటి ఉదయం వరకు అలసిపోకుండా ఏసు జన్మదినం కు స్వగతం పలుకుతూ పెద్దలు,చిన్నారులు ఆటపాటలతో , నాటక ప్రదర్శనలతో, మేరిమాత ప్రభువు కీర్తనలతో , బైబిల్ సూక్తులు తో,సంగీత ఆర్కెస్ట్రా తో , ఆహ్లదంగా గడిపారు. ఈ నేపథ్యంలో జిల్లాలోనే అతిపెద్దదయిన రూపాంతరం దేవాలయంలో వెలది మంది క్రైస్తవులు సమక్షంలో వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సుప్రసిద్ధమైన పెద్దపీట, చిన్నపేట తాడేరు, గునుపూడి ,లూథరన్, బేతని పేట చర్చలతో పాటు.. స్థానిక సెయింట్ మేరీస్ స్కూల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. (ఫై చిత్రంలో చూడవచ్చు) గత్ వారం రోజులుగా అక్కడ విద్యార్థులు చేస్తున్ననాటక ప్రదర్శనలు, నృత్యాలు అద్భుతం అనిపించాయి. స్కూల్ ప్రిన్సిపల్ జీబి ఆంటోనీ మాట్లాడుతూ క్రీస్తు మంచిని ప్రబోధించారని, తోటి స్నేహితులతో మంచి పనులు చేస్తూ ముందుకు సాగాలని అన్నారు. ప్రతిఒక్కరూ మంచిని కోరుకున్నప్పుడే క్రీస్తు మీలోనే ఉంటారని, తోటివారిపై ప్రేమను పంచలే తప్ప ద్వేషాలను పెంచకోకుడదని అన్నారు
