సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: గత అయిదు రోజులుగా ధరలు తగ్గుతూ వస్తున్నా బంగారం నిన్న ఒక్కసారిగా పెరిగింది. అయితే మళ్లీ నేడు సోమవారం బంగారం ధరకు కాస్త నిలకడ వచ్చింది. బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,200లకు చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,950కు చేరుకుంది. అయితే దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలో హెచ్చుతగ్గులు కనిపించాయి. ఇక వెండి ధరల్లోనూ మార్పు కనిపించలేదు. నేడు బంగారం మాదిరిగానే వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు తాజాగా ఎలా ఉన్నాయంటే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,200.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,950 అందుబాటులో ఉంటె విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,950 కొనుగోలు ధరకు అందుబాటులో ఉంది.
