సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: కేవలం బంగారు ఉంగరం కోసం స్నేహితుడిని హత్య చేసిన ప్రబుద్ద్దుడు కేసు వివరాలను తాజగా పాలకొల్లు పట్టణ పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ మీడియా కు వివరించారు. వారి వివరణ ప్రకారం.. పాలకొల్లు సోమేశ్వర అగ్రహారానికి చెందిన నిడమర్తి వెంకట సత్య సాంబశివరామ్ (44) పుట్టుక నుండి మాటలు రావు. అతను పెదసాయిబాబా గుడికి వెళ్లే మార్గంలో కలప దుకాణంలో పనిచేస్తున్నాడు. ఈ నెల 11న సాంబశివరామ్ చీకటి పడినా ఇంటికి తిరిగి రాకపోవడంతో సోదరుడు నిడమర్తి శ్రీనివాస్ ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దుకాణ యజమాని వెంకటేశ్వరరావుకు ఫోన్ చేసి అడగ్గా రాత్రి 7.20 గంటలకు పనిముగించుకొని, అతని స్నేహితుడైన ఉల్లం పర్రుకు చెందిన పిండి వీరబాబు తో బైకు పై ఇద్దరు వెళ్లినట్లు దుకాణ యజమాని తెలిపాడు. దీనిపై వీరబాబును ప్రశ్నించగా ఆర్వీ సుబ్బారావు ఆసుపత్రి వద్ద దించేశానని చెప్పాడు. ఇక ఆచూకి లేదు. అయితే 12 రోజుల తర్వాత మొగల్తూరు వద్ద ప్రధాన కాలువలో గుర్తు తెలియని మృతదేహాన్ని సాంబశివరాం గా పోలీసులు గుర్తించారు. చేతికి ఉండాల్సిన బంగారు ఉంగరం లేకపోవడం తో వీరబాబు ను పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నిం చగా తానే హత్య చేసిన నిజం ఒప్పుకున్నాడు. . టిడ్కో గృ హాల సమీపం లో సాంబశివరామ్ చేతికి ఉన్న ఉంగరాన్ని తీసుకొని ప్రధాన కాలువలో తోసేసినట్లు నిందితుడు నేరం అంగీకరిం చాడు. దీంతో వీరబాబును అరెస్టు చేసి ఎస్పీ తెలిపారు. కార్యక్రమం లో డీఎస్పీ మనోహరాచారి, సీఐ శ్రీనివాసయాదవ్, ఎస్సై ముత్యా లరావు ఇతర పోలీసులు పాల్గొన్నారు.
