సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: నరసాపురం ఎంపీ రఘురామా కృష్ణంరాజు నేడు, మంగళవారం ఢిల్లీలో రచ్చబండ లో భాగంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవగాహన రాహిత్యం వల్ల ప్రజల నెత్తిన ట్రూ అప్ చార్జీల భారం పడుతోందని ఇప్పటికే ఏడుసార్లు విద్యుత్ చార్జీలను పెంచారు. ఇప్పుడు 8వ సారి విద్యుత్ చార్జీలను పెంచబోతున్నారు. ప్రభుత్వ చేతగానితనం వల్ల ప్రజలు దారుణంగా నష్టపోతున్నారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో రెన్యుబుల్ ఎనర్జీ కోసం కొన్ని పి పి ఏ లను చేసుకుంది. యూనిట్ విద్యుత్ మూడు నుంచి మూడున్నర రూపాయలకు కొనుగోలు చేసే విధంగా ఒప్పందాన్ని కుదుర్చుకుందని అయితే . పిపిఏ లు చేసుకున్న విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన పాత బకాయిలను నిలిపివేశారు. కొత్తగా విద్యుత్తును కొనడం ఆపివేశారు. ఎక్స్చేంజిలో యూనిట్ విద్యుత్ కు ఐదు రూపాయలు చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేసింది. దీనితో యూనిట్ విద్యుత్ ధరకు అదనంగా రూపాయిన్నర చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది..ఎక్స్చేంజిలోయూనిట్ విద్యుత్ ఐదు రూపాయలకు కొనుగోలు చేయడం వల్ల , ప్రజలపై యూనిట్ విద్యుత్ భారం ఎనిమిది రూపాయలు పడింది. అందులో ఏదైనా మతలబు ఉండే ఉంటుంది. హిందూజా ప్లాంట్ ఖాళీగా ఉంచినందుకు 1230 కోట్ల రూపాయలను అప్పుచేసి మరి ఆ సంస్థకు చెల్లిస్తున్నారు. ఆ భారాన్ని మొత్తం ఇప్పుడు ప్రజలు ట్రూ అప్ చార్జీల రూపంలో భరించాల్సిందే. పాలకుల అజ్ఞానం వల్ల 20వేల కోట్ల రూపాయల విద్యుత్ భారం ప్రజలపై పడిందని రఘురామకృష్ణం రాజు తెలిపారు.
