సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భారత దేశంలో అత్యాచార ఆరోపణలు తో పరారైన వివాదాస్పద స్వామిజీ నిత్యా నంద స్వతంతంగా’కైలాస’ హిందూ దేశాన్ని ఏర్పాటు చేసిన విషయం అందరికి విదితమే.. అయితే తాజగా మరో సంచలనం సృష్టించారు. యూనైటెడ్స్ స్టేట్స్ అఫ్ కైలాస .. తరపున ఐక్యరాజ్య సమితి సమావేశాలలో… ఏకంగా ఆ దేశ ప్రతినిధి పాల్గొని అందరిని ఆశ్చ ర్యపర్చా రు. పైగా ఆ ప్రతినిది మాట్లాడుతూ.. నిత్యా నందను భారత్ వేధిస్తోం దని ఆమె ఆరోపించారు. ఆయనకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేసారు. జెనీవాలో గత వారం జరిగిన ఐరాస సమావేశం లో ఈ మహిళా ప్రతినిధి విజయప్రియ నిత్యానంద హాజరు అయిన విషయం వెలుగులోకి వచ్చింది. తన దేశం నుంచి ఐరాసలో శాశ్వత ప్రతినిధి నంటూ పరిచయం చేసుకున్నారు. ‘కైలాస.. హిందువుల కోసం ఏర్పడిన మొదటి సార్వభౌమదేశం . దీనిని నిత్యా నం ద పరమశివమ్ స్థాపించారు.ఆయన హిందూమత పునరుజ్జీవం కోసం పాటుపడుతున్నారు’ అంటూ తన దేశం , తన దేశాధినేత గురించి వెల్లడించారు. అలాగే ఆ దేశం నుంచి మరో ప్రతినిధి ఈఎన్ కుమార్ కూడా హాజరయ్యారు. ఈక్వెడార్‌కు సమీపంలోని ఓ ప్రెవేటు ద్వీపంలో కైలాస అనేది నిత్యా నంద ప్రపంచం.. దానికి తనని తాను ప్రధానిగా ప్రకటించుకున్నారు. కైలాసకు సొంతంగా డాలర్, రిజర్వ్ బ్యాంకు, జెండా, పాస్ పోర్ట్ ను తీసుకొచ్చారు
