సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏలూరు కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్ ప్రసన్నవెంకటేష్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా ప్రతినిధుల 2స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి వివరించారు. ఈ నెల 13న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటుహక్కు వినియోగించుకునే ప్రజాప్రతినిధులకు గుర్తింపు కార్డులు, ఓటర్‌స్లిప్‌లు అందిస్తున్నామన్నారు. ఐదు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఎనిమిది మంది డిఎస్పీలు, 10 మంది సర్కిల్ ఇన్స్ప్క్టర్లు, 230 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్త్ ప్రణాళిక రూపొందించామన్నారు. ప్రిసైడింగ్ అసిస్టెంట్ అధికారులుగా తహసీల్దార్, డిప్యూటి తహసీల్దార్లను నియమించామన్నారు. సూక్ష్మ పరిశీలకులను నియమించామన్నారు. పోలింగ్ సిబ్బందికి ఈ నెల 2న, మైక్రో అబ్సర్వర్లకు 4న శిక్షణ ఇస్తామన్నారు. కౌంటింగ్‌కు ఐదు టేబుల్స్ ఏర్పాటు చేశామని, ఐదుగురు జిల్లా అధికారులను పర్యవేక్షకులుగా నియమించామన్నారు. ఓటర్‌కార్డుకు ఆధార్ అనుసంధాన ప్రక్రియను 89.51 శాతం పూర్తి చేశామని చెప్పారు. ఎన్నికల సామాగ్రి కొనుగోలు చేసేందుకు ఏలూరు ఆర్డీఓను నోడల్ అధికారిగా నియమించామన్నారు. కౌంటింగ్ సిబ్బందికి ఈ నెల 4న, 15న శిక్షణ ఇస్తామన్నారు. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలను వెబ్ కాస్టింగ్‌కు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
