సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పుష్ప పాన్ ఇండియా హిట్ తో అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించాడు.. అయితే ప్రస్తుతం ‘పుష్ప 2’ షూటింగ్ లో పాల్గొంటున్న అల్లు అర్జున్ తదుపరి చిత్రం ఎవరితో చేస్తారు? అన్న ఎదురు చూపులకు తెరదించుతూ.. అర్జున్ రెడ్డి తో తెలుగు హిందీ లో సూపర్ హిట్స్ కొట్టిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో సినిమాను చేయనున్నట్లు నేడు, శుక్రవారం మీడియా సమావేశంలో అధికారికంగా ప్రకటించాడు. ఈ సినిమాను టీ సిరీస్ ప్రొడక్షన్స్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్‌పై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ నిర్మిస్తున్నారు.
