సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ టీడీపీ నేత, ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్‍చార్జ్ వరుపుల రాజా (46) హఠాన్మరణంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.గత రాత్రి గుండెపోటుతో రాజా మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రాజా మృతి పార్టీకి తీరని లోటని ఆయన అన్నారు. రాజా కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గోదావరి జిల్లాలోని టీడీపీ నేతలు నేడు, ఆదివారం విశేషంగా ఆయన నివాసానికి చేరుకొని కుటుంబ సబ్యులకు సంతాపాన్ని తెలియజేస్తున్నారు. వరుపుల రాజా కు డాక్టర్స్ గతంలో 2 స్తంట్స్ వేసినట్లు తెలుస్తుంది. అయినప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా తీవ్ర స్థాయిలో పలు ప్రాంతాలు తిరుగుతూ శ్రమించడంతో గత రాత్రి గుండెపోటు తీవ్రస్థాయిలో రావడంతో ఆయనను వెంటనే దగ్గర్లోని కాకినాడ సూర్య గ్లోబల్ ఆస్పత్రి కి తరలించారు. రాజా పరిస్థితి విషమించడంతో స్థానిక అపోలో ఆస్పత్రికి తరిలించారు. అయితే..వైద్యులు చికిత్స అందించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో రాజా మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *