సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలోనే అతిపెద్ద చర్చి గా ప్రసిద్ధి పొందిన, శతాబ్దన్నర పూర్వ చరిత్ర కలిగిన భీమవరం స్థానిక రూపాంతర దేవాలయంలో గత 3 వారాలుగా నిర్వహిస్తున్న వేడుకలలో భాగంగా నేడు, శనివారం క్రీస్తు జన్మదినం రోజు జరిగిన భారీ క్రిస్మస్ వేడుకలలో ప్రముఖ క్రైస్తవ ప్రముఖులు తో పాటు ముఖ్య అతిధిగా స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ హాజరయ్యి వారి ప్రార్ధనలు,,వినోద కార్యక్రమాలలో పాల్గొని అస్సిసులు పొందటం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉండే టీడీపీ పార్టీ రాష్ట్ర స్థాయి సీనియర్ నేత మెంటే పార్ధ సారధి, జనసేన పార్టీ జిల్లా అడ్జక్షుడు కొటికలపూడి చినబాబు , అన్ని రాజకీయ పార్టీల నేతలు కూడా హాజరయ్యారు. అయితే గత కొంత కాలంగా భీమవరంలో జరుగుతున్నా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే, గ్రంధి శ్రీనివాస్ కు, పవన్ భీమవరంలో పోటీచేస్తున్నప్పటి నుండి జనసేన చినబాబులకు, మధ్య మొదలయిన రాజకీయ పరంగా తీవ్ర వైరుధ్యం, ఫ్లెక్సి ల ఆవేశాలు, ప్రతి విమర్శలు చేసుకోవడం అన్ని టివి ఛానెల్స్ కు ఎక్కేశాయి. ఐతే అటువంటిది క్రిస్మస్ వేడుకలలో భాగంగా కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆ కేక్ ముక్కలను నిర్వాహకులతో పాటు ప్రక్కనే ఉన్న చినబాబు కు, మెంటే పార్ధ సారథికి స్వయంగా తన చేతితో నవ్వుతు తినిపించి కుశల ప్రశ్నలను వెయ్యడం వారు ఉత్సహంగా ఆయనతో కల్సి వేడుకలో పాల్గొనడం ఆహూతులకు అరుదైన దృశ్యం చూసినట్లయింది. మొత్తానికి ఏసుక్రీస్తు చాటి చెప్పిన ప్రేమ తత్వం రూపాంతర దేవాలయంలో స్వష్టమయింది
