సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: టీడీపీ యువ గళం 36 వ రోజు పాదయాత్రలో ఉన్న నారా లోకేష్ నేడు, సోమవారం పీలేరులో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ సాధించిన ఘన విజయంగా చెప్పుకొంటున్న 13 లక్షల కోట్ల పెట్టుబడులు నిజం కాదని.. విశాఖలో జరిగింది గ్లోబల్ సమ్మిట్ కాదు.. లోకల్ ఫేక్ సమ్మిట్ అని విమర్శించారు. . ఏబీసీ కంపెనీ టర్నోవర్ రూ. 120 కోట్లు అని.. అలా కంపెనీ లక్షా 20 వేల కోట్ల పెట్టుబడి ఎలా పెడుతుందని ప్రశ్నించారు. రూ.లక్ష కేపిటల్ ఉన్న ఓ కంపెనీ రూ.76వేల కోట్లు పెట్టుబడి పెడుతుందా ?టీడీపీ హయాంలో వచ్చిన కంపెనీలు జగన్ పాలనలో బైబై చెప్పాయన్నారు. ఏపీలో ఉన్న కంపెనీలు విస్తరణ చేపట్టడం లేదని.. అమర్రాజాతో పాటు ప్రముఖ కంపెనీలు వెళ్లిపోయాయని ఆరోపించారు. పీపీఏలు రద్దు చేయొద్దని కేంద్రం హెచ్చరించినా జగన్ పట్టించుకోలేదని లోకేష్ విమర్శించారు.
