సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇక ఫై ఆంధ్ర ప్రదేశ్ లో ప్రయాణికులకు డీజిల్ వాసన భరించవలసి అవసరం లేకుండా, వాతావరణ కాలుష్యం లేకుండా సుఖవంతమైన ప్రయాణానికి ఏపీఎస్ ఆర్టీసీ కొత్త బస్సుల కొనుగోలు లో బ్యాటరీతో నడిచే బస్సులకు ఎక్కువ గా ప్రాధాన్యం ఇస్తుంది. అతి త్వరలో 2,736 కొత్త బస్సులను కొనుగోలు చేయనుంది. కొత్త బస్సుల కొనుగోలుకు సీఎం జగన్ ఆమోదించారని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. విజయవాడ ఆర్టీసీ హౌస్‌లోని సమావేశపు హాలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.572కోట్ల వ్యయంతో 1,500 కొత్త డీజిల్ బస్సులు, గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ / ఓపెక్స్ మోడల్1000వరకు ఎలక్ర్టానిక్ బస్సులను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. మరో 200 బస్సులను డీజిల్ నుంచి ఎలక్ర్టికల్ బస్సులుగా మార్చనున్నామన్నారు. త్వరలో కర్ణాటక తరహాలో 15 మీటర్ల అంబానీ బస్సుల కొనుగోలుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. మరో 36 అద్దె బస్సులను కొనుగోలు చేస్తున్నామన్నారు
