సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి లోని పవిత్ర పంచారామ క్షేత్రంలో చంద్ర ప్రతిష్ట శ్రీ సోమేశ్వరుడు పాల్గుణ పౌర్ణమి పర్వదినం సందర్భంగా స్వచ్ఛమైన శ్వేతా వర్ణంలోకి మారి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్నారు. ‘నిండు పున్నమి చంద్ర కాంతు’లీనుతున్న శ్రీ సోమేశ్వర స్వామి వారికి పురోహితులు 54 కేజీల చక్కెర (పంచదార)తో అభిషేకం చేసి విశేషంగా వచ్చిన భక్తులకు అలంకార దర్శనం కలిపించారు. ( ఫై చిత్రంలో చూడవచ్చు..)
