సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పాలకొల్లు–భీమవరం జాతీయ రహదారిలో శివదేవునిచిక్కాల వద్ద గత శుక్రవారం స్విప్ట్ డిజైర్ కారు వేగంగా వచ్చి కొబ్బరిచెట్టును ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న పాలకొల్లు కు చెందిన మాజీ కౌన్సిలర్ బుద్దా చంద్రావతి (87) అక్కడికక్కడే మృతి చెందగా నలుగురు గాయపడ్డారు. పాలకొల్లురూరల్ ఎస్సై కె శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. .పాలకొల్లు పట్టణానికి చెందిన కొబ్బరి వ్యాపారి బుద్దా లక్ష్మీ నరసింహరావు, భార్య చంద్రావతి, కుమారుడు రామకృష్ణప్రసాద్, కోడలు యశోదలక్ష్మి, మనవరాలు మేఘన వివాహానికి హాజరై తిరిగి స్వస్థలం పాలకొల్లువస్తున్నారు. నరసిం హారావు కుమారుడు రామకృష్ణప్రసాద్ కారు డ్రైవింగ్ చేస్తున్నారు. ఉదయం మంచు తెరలు కారణం గా వీరు ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొట్టింది. ముం దు సీట్లో కూర్చున్న చంద్రావతి అక్కడికక్కడే మృతి చెందారు. రామకృష్ణకు తుంటి ఎముక విరిగింది. నరసిం హరావు మనవరాలు మేఘనకు రెండు కాళ్లు విరిగిపోయాయి. నరసింహరావు, కోడలు యశోదలక్ష్మికి స్వల్ప గాయాలయ్యా యి. వీరంతా పాలకొల్లులోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
