సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు, ఆదివారం ఎన్టీఆర్ జిల్లా, తిరువూరులో పర్యటించారు. ఈ సందర్భంగా జగనన్న విద్యాదీవెన సభ 4వ విడత కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యా దీవెన కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.700 కోట్లు బటన్ నొక్కి జమ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ 9.86 లక్షల విద్యార్థులకు మేలు జరిగేలా వారి తల్లుల‌ ఖాతాల్లో రూ. 700 కోట్లు వేస్తున్నామన్నారు. మనిషి పేదరికం నుంచి‌ బయట పడాలంటే చదువు ఉండాలన్నారు. పేద విద్యార్థులు కోసం జగనన్న‌ విద్యా‌దీవెన, వసతి‌ దీవెన రెండు పథకాల కింద అక్షరాలా రూ. 13,311 కోట్లు ఖర్చు చేశామన్నారు టీడీపీ హయాంలో చంద్రబాబు విద్యార్థుల కాలేజీ పీజులు ఎగ్గొట్టి బకాయిలు పెడితే… ఆ డబ్బు కూడా తామే కట్టామన్నారు. ఎవరికైనా ఇబ్బంది‌ ఉంటే 1092కు ఫోన్ చేస్తే ఆ కాలేజ్ వాళ్లతో సీఎంవో అధికారులు మాట్లాడేలా చేశామన్నారు. చంద్రబాబు, దత్తపుత్రుడు వారి దుష్ట చతుష్టయానికి సవాల్ విసురుతున్నాన్నారు. మా వైసిపి ప్రభుత్వం మంచి‌ చేయలేదని నమ్మితే పొత్తు కోసం వారికి ఎందుకు ఆరాటం?. ఎందుకు ఈ తోడేళ్లు ఏకం అవుతున్నాయని ప్రజలకు అర్హం అవుతుందన్నారు. వీరిలో రాష్ట్రంలో 175 సీట్లలో‌ ఒంటరిగా పోటీ చేసి మా వైసీపీ ని ఎదుర్కొనే సత్తా ఎవరికైనా ఉందా? అని సవాల్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *