సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఇటీవల భారతదేశంలో యువత నగరాలలో పాటిస్తున్న సహజీవనాలు అనే పశ్చిమ దేశాల సంస్కృతీ గురించి అందరికి తెలిసిందే. అయితే సహజీవనాల్లో నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆ బంధాలను రిజిస్టర్ చేయాలంటూ ఓ మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే దానివల్ల ప్రయోజనమేముందని సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆ సంబంధాలను రిజిస్టర్ చేసేలా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు రూపొందించాలంటూ చేసిన అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. అది తెలివి తక్కువ ఆలోచన అని పిటిషన్‌దారుపై మండిపడింది.. ఈ పిటిషన్‌తో సహజీవనం చేసేవారికి భద్రత కల్పించాలని చూస్తున్నారా? లేదా అలాంటి బంధంలోకి ఎవరూ వెళ్లొద్దని కోరుకుంటున్నారా? అని కోర్టు ప్రశ్నించింది
