సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: దేశవ్యాప్తంగా వంట నూనెల ధరలు తగ్గాయి. బ్రాండ్, నూనె రకాన్నిబట్టి గరిష్ట ధరపై 10–15 శాతం వరకు తగ్గిందని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) సోమవారం ప్రకటించింది. ధరలు సవరించిన కంపెనీల జాబితాలో అదానీ విల్మర్ (ఫార్చూన్ బ్రాండ్), రుచి సోయా (మహాకోష్, సన్‌రిచ్, రుచి గోల్డ్, న్యూట్రెల్లా), ఇమామీ (హెల్తీ అండ్ టేస్టీ), జెమిని (ఫ్రీడమ్), బాంజ్ (డాల్డా, గగన్, చంబల్ బ్రాండ్స్) వంటివి ఉన్నాయి. అంతర్జాతీయంగా అధిక ధరల కారణంగా గత ఏడాది కాలంగా దేశీయంగా వంట నూనెలు 2ఏళ్ళ క్రితంతో పోలిస్తే కనివిని ఎరుగని రీతిలో ఏకంగా 100 శాతం వరకు పెరిపోయిన నేపథ్యంలో గత 2నెలల నుండి కాస్త తగ్గుదల కనిపిస్తూ నేడు, మంగళవారం నుండి మరో 15శాతం వరకు తగ్గడం ఈ కొత్త ఏడాది, పండుగల సమయం లో నిజంగా ప్రజలకు శుభవార్తే..
