సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఇప్పటికి మానవబంధాలు ఎంత గొప్పవో చేప్పే సంఘటన పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది, ఇంటిపెడ్డ మామగారు చనిపోవడం పరిస్థితిని జీర్ణించుకోలేక కోడలు కూడా మరణించిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా,పాలకొల్లు సమీపంలోని జిన్నూరులో గత శనివారం సంచలనం రేపింది, వివరాలలోకి వెళ్ళితే.. జిన్నూరు పెదపేటకు చెందిన రిటైర్డ్, వెటర్నరీ అసిస్టెంట్‌ కాటం వెంకట్రావు(85) మొన్న శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. చిన్నకుమారుడు మాణిక్యాలరావు మినహా మిగిలిన వారంతా వేర్వేరు గ్రామాల్లో ఉంటున్నారు. వెంకట్రావు భార్య చంద్రకాంతం సుమారు 30 ఏళ్ల కిందటే మృతి చెందారు. ఈ క్రమంలో మాణిక్యాలరావు పాలకొల్లులో ఓ ప్రైవేటు కాలేజీ లో పనిచేస్తుండగా భార్య కిరణ్మయి (38) తణుకు ఉమెన్స్‌ కళాశాలలో టీచర్గా పనిచేస్తూ మామగారిని స్వంత తండ్రిలా చూసుకునేవారు, ఈ నేపథ్యంలో మామగారి హఠాత్తు మరణాన్ని తట్టుకోలేక కిరణ్మయి ఆహారం తీసుకోకుండా విలపించడంతో నీరసించి కుప్పకూలి అపస్మారక స్థితికి చేరారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను పాలకొల్లులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కిరణ్మయికి ఇద్దరు కుమార్తెలు. తండ్రి చనిపోయిన బాధలో ఉన్న మాణిక్యాలరావు కు భార్య మరణం మరింత విషాదంలోకి తోసేసింది,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *