సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ప్రతి వ్యాపారంలో సమస్యలు ఉన్నాయి. కానీ 70 శాతం పైగా సినిమా కలెక్షన్స్ ఆదాయం ఏపీ నుండి పొందుతున్నామని సృహ లేకుండా కొందరు సినీ ప్రముఖులు బహిరంగంగా ఏపీలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడిన మాటలు వాటికీ కౌంటర్ గా అన్నట్లుగా రాష్ట్రంలో జరుగుతున్నా పరిణామాలు అందరికి తెలిసిందే.. నేడు, మంగళవారం మంత్రి పేర్ని నానితో సినీ థియేటర్స్ యాజమాన్యాలు చర్చలు జరుగుతాయని సమాచారం. ఇక దిల్ రాజు తాజాగా ఒక కీలక ప్రకటన చేసారు. ‘‘ప్రేక్షకులను, సినిమా ఇండస్ట్రీని బ్యాలెన్స్‌ చేయాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఉంది. ఇలాంటి అంశాలపై చర్చించేందుకు ఏపీ ప్రభుత్వం ఓ కమిటీ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామం’. టిక్కెట్ల ధర పెంపు, 5వ ఆటకు అనుమతి వంటి అంశాలపై చర్చించేందుకు ఏపీ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయనుంది. ఈ కమిటీలో ప్రభుత్వ ప్రతినిధులతో పాటు ఇండస్ట్రీ నుంచి ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్‌ ఉంటారు.ఈ కమిటీలోని వాళ్లు ఇండస్ట్రీ సాధక బాధకాలు ప్రభుత్వానికి వినిపించి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తారు.త్వరలోనే టిక్కెట్ల విషయంలో కొత్త జీవో వస్తుందని ఆశిస్తున్నాం. అప్పటి వరకు ఫిల్మ్‌ ఇండస్ట్రీ నుంచి ఎవరూ సోషల్‌ మీడియా పోస్టులు చేయకపోవడం, మాట్లాడకపోవడం మంచిది. మాకు అపాయింట్‌మెంట్‌ ఇస్తే ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ గారిని, మంత్రి పేర్ని నానిగారిని కలవాలనుకుంటున్నాం.అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *