సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజగా ఏలూరు జిల్లాలో మరో కొత్త మండలం ఏర్పాటుకు రంగం సిద్ధం అయ్యింది, అర్బన్‌ మండలాల ఏర్పాటులో భాగంగా ఏలూరు జిల్లాలోని ఏలూరు మండలాన్ని రెండు మండలాలుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ తాజగా జారీ చేసింది. ఈ విభజన విషయంలో ఎవరికైనా అభ్యంతరాలు/ సూచనలు ఇవ్వ దలచుకుంటే నెలరోజులు లోగా జిల్లా కలెక్టర్‌కు తెలియజేయాల్సి ఉంటుందని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటైన ఏలూరు అర్బన్‌ మండలంలో చొదిమెళ్ళ, తంగెళ్ళమూడి, శని వారపుపేట, సత్రంపాడు, వెంకటాపురం, కొమడవోలు, పోణంగి మొత్తం 7 పంచాయతీలు ఉంటాయి. ఏలూరు రూరల్‌ మండలంలో చాట పర్రు, జాలిపూడి, కాట్లంపూడి, మాదేపల్లి, మల్కాపురం, మానూరు, శ్రీపర్రు, కలకుర్రు, కోమటిలంక, గుడివాకలంక, కొక్కిరాయిలంక, పైడిచింతపాడు, ప్రత్తికోళ్లలంక మొత్తం 13 గ్రామాలు ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *