సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో జగన్ సర్కార్ ఓటీఎస్‌ను రద్దు చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి మాజీ ఎంపీ తోటసీతారామ లక్ష్మి నేతృత్వంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా చేశారు. ఫైర్‌స్టేషన్ సెంటర్ నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకుని ఆందోళన చేశారు. పేదల నుంచి వేల రూపాయలు వసూలు చేసే హక్కు సీఎంకు ఎక్కడిదని టీడీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేస్తామన్నారు. ఓటీఎస్‌ను రద్దు చేసే వరకు పోరాటం చేస్తామన్నారు. వలంటీర్లు, వీఆర్వోలు, ఇతర సిబ్బందితో లబ్ధిదారుల మెడపై కత్తి పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఆందోళనలో ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌రావు, నరసాపురం, ఏలూరు పార్లమెంటరీ నియోజ కవర్గాల అధ్యక్షులు, గన్ని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, ముప్పిడి వెంకటేశ్వరరావు, ఆరిమిల్లి రాధాకృష్ణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ళ నాగేశ్వరరావు, నాయకులు వలవల బాబ్జీ, పొత్తూరి రామరాజు, కొక్కిరిగడ్డ జయరాజు, బడేటి రాధాకృష్ణ (చంటి) తదితరులు పాల్గొన్నారు.
