సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: తెలంగాణలో ఒమైక్రాన్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ 56 కేసులను గుర్తించగా.. తాజాగా నేడు, మంగళవారం మరో 7 కేసులు నమోదు అయ్యాయి.మొత్తంగా 63కు చేరింది. దీంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ఒమైక్రాన్ వ్యాప్తి కట్టడి కోసం ఒమైక్రాన్‌ను గుర్తించిన ఏరియాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఒమైక్రాన్ సోకిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లోఒమైక్రాన్ కేసుల సంఖ్యా చాలా స్వల్పముగా ఉండటం విశేషం. దేశ రాజధాని ఢిల్లీ లో అయితే రాష్ట్ర ప్రభుత్వం పెరిగిపోతున్నఒమైక్రాన్ కేసుల దృష్ట్యా సినిమాహాళ్లు, స్కూల్స్ మూసివేసే దశగా అడుగులు వేస్తున్నట్లు తాజా సమాచారం..
